బావా మరదలి మాటలు, పాటలు


నచ్చి ఉంటే ధన్యవాదములు

నచ్చకుంటే క్షమించండి


జై గణేష్


బావా మరదలి మాటలు, పాటలు 
- రాజ్

ఏఎన్ఆర్ డైలాగ్ లా చెప్పాలంటే
కృష్ణ, అతని మరదలు రాధ, హృదయాల ప్రేమ ఓక బాధ, జీవితం ఓక వింతైన గాధ

ఎన్టీఆర్ లా చెప్పాలంటే
బ్రదర్, ఇతడు కృష్ణ, ఈమె అతని మరదలు రాధ, వీరిది మన్మధ ప్రేమ కలహము, బాధ, తీపి, అన్ని కలిసుంటాయనుకో మరి 

కృష్ణ రాధలది రోజుకో ఆటా పాటా

కృష్ణ
కృష్ణది ఈ ఊరే
మీ ఊరే
ప్రతి ఊరు నా ఊరే, విహారి

కృష్ణ ఇంజనీరింగ్ చదివాడు.
కానీ కృష్ణ ఉండేది, పనిచేసేదీ కర్ణాటకలో
బ్యాంకు ఆఫీసర్ గా ఉద్యోగం
టెస్ట్ రాసి, గ్రూప్ డిస్కషన్ GD, ఇంటర్వ్యూ, కృషి, దేవుడి దయ, ఓక ఉద్యోగం 

రాధ
రాధని డాక్టర్ చేద్దాం
ఇతడి భానుప్రియ ఈవిడ, మంగభామ.
ఈవిడ కాకినాడలోనో లేకుంటే కర్నూల్ లోనో  చదువుకుంది

(రెండు పేర్లు ఎందుకు?
అక్కడ మెడికల్ కాలేజీ ఉందా లేదా అని గూగుల్ చెయ్యాలి
కర్నూల్ మెడికల్ కాలేజీ ఉందని తెలుసు గనక కర్నూలు కాలేజీ అని రాస్కుంటా 
సత్యదూరం కాని కధలు రాయటం నేర్పుతున్నా అంటున్నాడు దైవ కృపతో కధలు రాసిన అనుభవం ఉన్నవాడైన రచయిత.
సాహిత్యం పెద్ద దురద బాబోయ్, జీవితమే పెద్ద సినిమా చిత్రరాజం)
రాధ కృష్ణ హృదయానికి సరైన వైద్యం
ఇది చరిత్ర కూడా


రాధా కృష్ణులు :
కృష్ణకి రాధ మరదలు
బావా అంటే చచ్చిపోతాడు ఆ ముద్దుల మరదలి పిలుపుకి

తను ఎన్టీఆర్, మరదలు జయలలిత సత్యభామ లాంటిది అనుకున్నాడు 
మరదలు గుర్తొచ్చింది, ఓక పాట పుట్టింది

కృష్ణ ఇలా పాడాడు :

1
మల్లె పూలు పెట్టుకుని, నిండు చీర కట్టుకుని
ఓర చూపులు చూడమాకే ఉండలేడు నీ మొగుడు
తీపి చక్కెర ఎక్కువాయె, ముద్దుముద్దుగ పలుకవేమి
అమ్మాయంటే నీవేనమ్మి, లేలేత పూలకొమ్మ

మల్లె పూలు పెట్టుకుని, నిండు చీర కట్టుకుని
ఓర చూపులు చూడమాకే ఉండలేడు నీ మొగుడు

2
ఉట్టి చూపులు చాలులేవే, ప్రేమ మాటలు చిలకరించు
ముచ్చటైన ముద్దుగుమ్మ, సరసాలన్నీ సాగనివ్వు
అలసిన మగని చూసుకోవే, ఓడిలోనే మరి ఊరడించు 
పాట పాడి సేవ చేసే పెళ్ళాముంటే స్వర్గమేగా

మల్లె పూలు పెట్టుకుని, నిండు చీర కట్టుకుని
ఓర చూపులు చూడమాకే ఉండలేడు నీ మొగుడు

----

కృష్ణ కొటేషన్స్ కూడా రాస్తాడు :

ఏదో ఓక మరదలికై అన్వేషణే ఈ జీవితం
ఆ మరదలు ప్రేమ రాసోత్పత్తి చేసే భానుప్రియ లా ఉండాలి, ఆవిడ కూచిపూడి చూసారు కదా, ఘల్లు ఘల్లు ఘల్లు మంటు, అబ్బో....
- కృష్ణ

దేవుడిచ్చిన మరదలు ఆవిడ 
ఊహాజనీతం మరదలు, నిజంగా లేదండోయ్
ప్రేమ ఆర్తి, సరసం, రొమాన్స్ కోసం ఊహించుకున్నాడు
మీరు బాధ పడొద్దు, వాడికి సహాయం ఒక్కడున్నాడు
నారు పోసిన వాడు నీరు పెట్టక మానడు, ఆ దేవుడున్నాడు

పొదుపరి వెధవ, పైసా ఖర్చు లేకుండా ఆనందంలో తేలతాడు వీడు
జీవితం మనం తయారుచేసుకుంటాం
Be very careful about what you think,
You become what you think
వివేకం ఉన్న అనందుదనుకుంటా, అన్నాడు
జాగ్రత్త సుమా, ఏదనుకుంటే ఆలా అవుతాము 


ఇంతకీ భానుప్రియ గారు గుర్తొచ్చారు
అది బంగారు కాలం, ఆవిడ అందాల భరిణ, కళాకారిణి 
గూగుల్ చేసాడు ఆ పాట
సిరివెన్నెలా, నేను వేటూరి అనుకున్నానే

విశ్వనాథ్ దర్శకత్వం, అది తెలుసు.
సిరివెన్నెల కలం పలికిందట, ఎంత బాగుంటుందో ఈ సినిమా గీతం :

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు 
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు
నల్లమబ్బు చల్లని చల్లని చిరుఝల్లు (2)
పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు 
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు
వెల్లువొచ్చి సాగని తొలకరి అల్లర్లు (2)
ఎల్లలన్నదే ఎరుగని వేగంతో వెళ్ళు

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు 
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు

BSNL లో పనిచేసారు అని విన్నాను, కావున రింగ్ రింగ్ అంటోంది పాట అంటాను

---------


కృష్ణ :
గోడతో ముష్ఠి యుద్ధం చేస్తున్నాడు,
బోరు కొట్టింది
ఏదో పాట పాడుకుంటూ పడుకున్నాడు.

ఏదో ఆలోచిస్తూ ఉండగా ఫోన్ మోగింది గుండెలో, అవతలనుండి డెబ్భై ఏళ్ళ ముద్దుల మరదలు, ఏంటి బావా ఫోన్ చెయ్యవు, వెధవ అని తిట్టింది బుంగ మూతి పెట్టి (వీడియో కాల్)

ప్రేమ అజరామరం, ఊహలకు వయస్సు నిబంధనలు లేవు, ఇది ప్రేమ అవధానం

గరికపాటి గుర్తొచ్చాడు అవధానం అనగానే.
కృష్ణ గరికపాటి అయ్యాడు
----
అమ్మాయ్ ప్రేమ రసమ్ము పొంగెను హృదిలో
అమ్మాయ్ ప్రేమ రసమ్ము పొంగెను హృదిలో
నీవు కాంతవు గాదు లతవు, లతవు గావు గుండె తొలిచిన పురుగువు, పురుగువు కాదు ప్రేమ బాధా పులివి, నా కూనవు, నా హృదయ రాణివి, నా నెచ్చెలివి, వెచ్చని నీ ప్రేమ, వెన్న ముద్దులు, మనిషంటే నీవు మానవత్వము నీవే....
ఇలా ఉండాలి గదండీ ప్రేమికురాలంటే మీరే చూడండి...
---

కృష్ణకి పరకాయ ప్రవేశమంటే ఇష్టం

కృష్ణ :
నేను సినిమా హీరో జూనియర్ ఎన్టీఆర్ ని

రాధ :
నేను కేట్ అప్టన్
(Kate Upton
కృష్ణ మరో ప్రేమ పదార్థం పేరది)
నేను ఎవరెస్ట్ శిఖరం నుండి మీకు దూరవాణి చరవాణిపై పలుకుచున్నాను
నేను మీ మరదలినని గుర్తున్నానా లేదా
ఫోన్ చెయ్యలేదు?

కృష్ణకి రాధ గుర్తొచ్చింది
మిల్లి సెకను వ్యవధిలో, ఎవరెస్ట్ చేరుకున్నాడు 
(క్షణంలో వెయ్యో వంతు, 1/1000 of a second)

సినిమా కధల్లో లాజిక్ చూడరాదు
కృష్ణ ఎయిరక్రాఫ్ట్ నుండి దూకి ఎవరెస్ట్ శిఖరం మీద అమ్మాయి పక్కనే చేరుకున్నాడు
ఇక్కడ ఉన్నది ఇంకెవ్వరో, రాధ కాదు

కృష్ణ :
నాటీ గర్ల్
ఇక్కడ వేరే బ్యూటీ ఉన్నది
నీవు కాదు
నీవు నిజంగా ఎక్కడ ఉన్నవో చెప్పు

రాధ :
నేను ఆఫ్రికా లో పులిని బైనోక్యూలర్స్ లో చూస్తున్నాను 
దాన్ని భయపెట్టాలని ఉంది, ఏం చెయ్యను

కృష్ణ :
GPS Coordinates పంపించు వాట్సప్లో, నేను వస్తున్నా


అడవిలో ఆట :
కృష్ణ చేరుకున్నాడు రెండు సెకన్లలో 
ఇద్దరూ పులిని బెదిరేలా చెయ్యాలని అనుకున్నారు

దూరంగా జీపులో ఉన్నారు 
కృష్ణ తీసుకొచ్చిన తుపాకీ గాల్లో కాల్చాడు 
తమ పక్కన ఉన్న  చెట్టుపై ఉన్న పిట్టలు పారిపోయాయి కానీ పులి పారిపోలేదు

ఈ సారి పులి పక్కకు కాల్చాడు ధీరోదాత్తుడు కృష్ణ
పులి వీరివైపుకు రాసాగింది
బండి కదిల్చి, పులిని గట్టిగా తిట్టి, అక్కడి నుండి కృష్ణ జీపు కదిల్చాడు


ఓక పద్యం పలికాడు వెళుతూ,
కృష్ణుడికి పద్యాలు ఇష్టం గనక :
నీవు నిజమైన పులివేని
నీది పులి జాతి అన్నది నిజమేని
నీవు తాగినది నిజమైన పులి పాలేని
వేచి ఉండుము ప్రాణముతో ప్రాణములుండెనేని
ఈ కృష్ణుడు పోటుగాడని తెల్సుకుంటివేని
నిన్ను మరల భయపెట్టెద నేనే వచ్చి
ఇది నిజములేవే ఓసి బుజ్జి ముండా

నిజ ధీరుడనగు నేను తిరిగివత్తును
అప్పుడు తేల్చుకుందాము ఎవరెంత ధీరులో మనిద్దరిలోన


రాధ ఓదారుస్తోంది శ్రీదేవిలాగా 
రాధ:
వెధవ పులి నిన్ను అలిసిపోయేలా చేసింది బావా, పాపం అలిసిపోయావు 

కృష్ణుడు తమాషాగా, ఎన్టీఆర్ చెప్పిన్నట్టు యాక్టింగ్ చేస్తూ చేయి చూపిస్తూ అన్నాడు :
నీకోసం వంకాయ పొలం సాగు చేస్తా, వంకాయ కూర తిందాము, నిమ్మ తోట వేస్తా, నిమ్మకాయ రసం తాగుదాం, కష్టించి ఓక రాజ్యం కడ్తా, రాణిగా ఉంటావు నాతో కలకాలం చెలీ

కృషి  ఉంటే కృష్ణుడు ఋషి అవుతాడు....మహాపురుషుడౌతాడు.... తరతరాలకి తరగని వెలుగవుతాడు ... నీ బావౌతాడు 

రాధ
ధన్యవాదములు బావా
ధన్యవాదములు బావ మహారాజా


వేటూరి, సిరివెన్నల ఇలాంటి వారేనా, నేను రాస్తా ప్రేమ గీతం అన్నాడు...
పాట ఏస్కున్నాడు సోకు పురుషుడు :

కృష్ణ :
సరస రసిక మధుర మధన సరసమాడ సరసకు రావే...
నా దానవే, నా ప్రాణమే,
నా జీవితం నీవే గదే,
నీకన్నా నాకెవరె, ఎవరెక్కువే......

ఆగుపడగానే నువ్వు.....రసరమ్యమైన...భావనలు కలిగి పులకించెను... నా ఈ మది....
రమ్యకృష్ణలా ఉన్నావులే
నువ్వే నిజంగా భలే......

కొంచెం ముందుకు వెళ్లారు.
ఈ సారి వెళ్తుంటే ఏనుగులు కనపడ్డాయి, వెంటనే 
దూరంగా పోనిచ్చాడు కృష్ణ
ఏనుగుల గురించి, వాటి ఘీంకారాలు, వాటి బలం గురించి కృష్ణకు కొంత తెలుసు

కొలను వచ్చింది.
ఇద్దరూ ఈత కొట్టారు.
జలకాలాడి పక్కనున్న టౌన్లో విడిది చేసి, జీపు తిరిగిచ్చి, కాకినాడకు తిరిగి వచ్చిరి.


టైం మెషిన్ ఎక్కారు సరదాగా, కృష్ణ వస్తూ తన జేబులో తీస్కొచ్చాడు 
కావాల్సిన ప్రదేశం, కాలం చేరుకున్నారు 

స్థలం :
వాయసపురం
(తరావాతి కాకినాడగా మీరుందురేమో)
సంవత్సరం 
1926
------------------

ప్రేమే జీవితం
ఇక్కడ మరో పాట పాడుకున్నారు బావా మరదలు

కృష్ణ అందుకున్నాడు పాట
ముద్దుల మరదలా, నా ముద్దుల మరదలా
కొంచెం విను...

నదిలో నీరు, యెదలో మీరు
గోడు విందురు పెళ్లి అందురు


రాధ
నాలో నేను, మీలో మీరు
ఊరుకొందురు పెద్దలుందురు 

కృష్ణ 
నీలో అందము, నాలో మగసిరి
కాలమొచ్చెను వలపుగిచ్చెను

రాధ
సొగసే నాలో, తుంటరి నీలో
కదిలె కాలము ప్రేమ హెచ్చెను  

కృష్ణ 
ప్రేమె వెచ్చన ప్రేమె ఇష్టము
తీపి కష్టము, తోడునిద్దురు 

రాధ 
ప్రేమే వెచ్చనా ప్రేమే వచ్చెనా
సొంతదానను వేచి ఉందురు

- సంగీతం -

రాధ 
ప్రేమే నీయెద ప్రేమే నా యెద
సొదయె యెదయెద  తెల్సుకుందురు

కృష్ణ 
ప్రేమే  నీయెద ప్రేమే నా యెద
సొదయే యెదయెద  తెల్సుకుంటినే


ఇద్దరూ ఆనందంగా ఉన్నారు,
ఇప్పటికి ఇంతే.


తన కధ అంకితం ఇచ్చాడు కృష్ణ
వనితలేగదా ప్రేమకు మూలం, కోట, ఆలవాలం. 
నా ప్రేమ, నా కధ, నా జీవితం, నా మరదళ్లకు అంకితం 
- కృష్ణ 

-----------------------------------------------


కామెంట్‌లు