బావా మరదలి మాటలు, పాటలు
నచ్చి ఉంటే ధన్యవాదములు నచ్చకుంటే క్షమించండి జై గణేష్ బావా మరదలి మాటలు, పాటలు - రాజ్ ఏఎన్ఆర్ డైలాగ్ లా చెప్పాలంటే కృష్ణ, అతని మరదలు రాధ, హృదయాల ప్రేమ ఓక బాధ, జీవితం ఓక వింతైన గాధ ఎన్టీఆర్ లా చెప్పాలంటే బ్రదర్, ఇతడు కృష్ణ, ఈమె అతని మరదలు రాధ, వీరిది మన్మధ ప్రేమ కలహము, బాధ, తీపి, అన్ని కలిసుంటాయనుకో మరి కృష్ణ రాధలది రోజుకో ఆటా పాటా కృష్ణ కృష్ణది ఈ ఊరే మీ ఊరే ప్రతి ఊరు నా ఊరే, విహారి కృష్ణ ఇంజనీరింగ్ చదివాడు. కానీ కృష్ణ ఉండేది, పనిచేసేదీ కర్ణాటకలో బ్యాంకు ఆఫీసర్ గా ఉద్యోగం టెస్ట్ రాసి, గ్రూప్ డిస్కషన్ GD, ఇంటర్వ్యూ, కృషి, దేవుడి దయ, ఓక ఉద్యోగం రాధ రాధని డాక్టర్ చేద్దాం ఇతడి భానుప్రియ ఈవిడ, మంగభామ. ఈవిడ కాకినాడలోనో లేకుంటే కర్నూల్ లోనో చదువుకుంది (రెండు పేర్లు ఎందుకు? అక్కడ మెడికల్ కాలేజీ ఉందా లేదా అని గూగుల్ చెయ్యాలి కర్నూల్ మెడికల్ కాలేజీ ఉందని తెలుసు గనక కర్నూలు కాలేజీ అని రాస్కుంటా సత్యదూరం కాని కధలు రాయటం నేర్పుతున్నా అంటున్నాడు దైవ కృపతో కధలు రాసిన అనుభవం ఉన్నవాడైన రచయిత. సాహిత్యం పెద్ద దురద బాబోయ్, జీవితమే పెద్ద సినిమా చిత్రరాజం) రాధ కృష్ణ హృదయానికి ...